Mansoor Ali Khan : ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి వెయ్యి కోట్లు సంపాదించాడు – నటుడు మన్సూర్ అలీ

చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రజల కోసం పైసా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 06:28 PM IST

మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan)..గత పది రోజులుగా ఈ పేరు మీడియా లో హల్చల్ చేస్తుంది. తెలుగు తో పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న మన్సూర్ ..ఇటీవల త్రిష (Trisha) ఫై చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదంలోకి నెట్టేశాయి. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందని మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ వ్యాఖ్యల ఫై యావత్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్రిష కు సపోర్ట్ గా నిలిచారు. వారిలో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ఉన్నారు. మన్సూర్ వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని చిరంజీవి అనడం ఫై మన్సూర్ మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రజల కోసం పైసా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. ఆయనతో కలిసి నేను కూడా నటించాను. ప్రతి ఏటా పాత హీరోయిన్లు అందరితో కలిసి పార్టీ చేసుకుంటారు. కేవలం ఆడవారినే ఆ పార్టీకి పిలుస్తారు. దాని గురించి నేనేమీ అనడం లేదు. అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ, నా విషయంలో కనీసం ఫోన్ చేసి, మన్సూర్ అలీ ఖాన్ ఏం అయ్యింది? ఇలా ఎందుకు అన్నావ్? అని అడగలేదు. పెద్ద నటుడు ఇలా చేయడం నాకు బాధ అనిపించింది’’ చిరంజీవి లాంటి పెద్ద నటుడు ఏం జరిగిందో తెలుసుకోకుండా అడ్డగోలుగా వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్నారు. ఆయన తనకు ఫోన్ చేసి “మన్సూర్.. ఏం జరిగిందో చెప్పు” అని అడిగి తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు. ఏం తెలుసుకోకుండా విమర్శించడం ఆవేదన కలిగించిందన్నారు.

అంతే కాదు చిరంజీవిపై రూ. 20 కోట్లు, త్రిష, ఖుష్బూపై రూ. 10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. త్రిష తో పాటు చిరంజీవి, ఖుష్బూ మీద కేసు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. పది రోజుల పాటు ప్రజలతో పాటు తన శాంతికి విఘాతం కలిగించారని, వ్యభిచారానికి ప్రేరేపిస్తూ అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. సదరు వ్యక్తులపై క్రిమినల్, సివిల్ దావా వేస్తామన్నారు. తాను మీడియా సమావేశంలో మాట్లాడింది ఒకటి అయితే, ఎడిట్ చేసి త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు అసభ్యంగా చిత్రీకరించారని మన్సూర్ ఆరోపించారు. పూర్తి ఆధారాలతో కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు.

Read Also : Telangana Election : ముగిసిన ఎన్నికల ప్రచారం.. 144 సెక్షన్ అమల్లోకి : వికాస్ రాజ్