Site icon HashtagU Telugu

Mansoor – Chiranjeevi : చిరు, త్రిష, కుష్బూలపై మన్సూర్ పరువునష్టం దావా

Mansoor Ali Khan To File De

Mansoor Ali Khan To File De

Mansoor – Chiranjeevi : సోషల్ మీడియా వేదికగా తనను అవమానించారంటూ మెగాస్టార్​ చిరంజీవితో పాటు త్రిష, కుష్బూలపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆ ముగ్గురు వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి ఆయన రూ.1 కోటి పరిహారాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం (డిసెంబర్ 11)న మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వివాదానికి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ?

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను ఎన్నో రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్​ ఉంటుందని అనుకున్నాను. ఆ సీన్​ లేకపోవడం వల్ల నాకు బాధ కలిగింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను చూసిన త్రిష సోషల్‌ మీడియా వేదికగా మన్సూర్​పై ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘లియో’ డైరెక్టర్​ లోకేశ్‌ కనగరాజ్‌, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, సింగర్ చిన్మయిలు త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు.

Also Read: Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’తో చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్ జట్టు

దీనిపై స్పందించిన మన్సూర్.. ‘‘త్రిషపై నాకెంతో మంచి అభిప్రాయం ఉంది. ఆమెను గౌరవిస్తున్నాను. నేను సరదాగా చేసిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందని అనుకోలేదు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు’’ అని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఆ స్టేట్​మెంట్​ను సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో తనపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా ఇప్పుడు ఆయన చిరుతో పాటు త్రిష, కుష్బూలపై పరువు నష్టం(Mansoor – Chiranjeevi) కేసు దాఖలు చేశారు.