Site icon HashtagU Telugu

Mansion 24 Trailer : భయపెట్టేందుకు వస్తున్న ఓంకార్ అన్నయ్య

Mansion 24

Mansion 24

ఓంకార్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు..ఓంకార్ (Omkar) అన్నయ్య అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తాడు. జెమిని మ్యూజిక్‌లో అంకితం అనే మ్యూజిక్ షోలో వీడియో జాకీగా టెలివిజన్‌లోకి అడుగుపెట్టిన ఓంకార్..ఆ తర్వాత ఆట షో తో విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఆట తో ఓంకార్ కాస్త ‘ఓంకార్ అన్నయ్య ‘ గా మారాడు. ఆ తర్వాత బుల్లితెర నుండి వెండితెర కు డైరెక్టర్ అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. 2015 లో రాజు గారి గది మూవీ ఓంకార్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి అలరించాడు.

తాజాగా ఇప్పుడు మరో హర్రర్ సిరీస్‌ మ్యాన్షన్ 24 (Mansion 24 ) తో డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఓంకార్ తెరకెక్కిస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), సత్యరాజ్ (Satyaraj), అవికా గోర్ (Avika), బిందుమాధవి, సిమ్రన్, రావు రమేష్, జయప్రకాశ్, తులసి, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటీనటులతో పాటు అర్చన జియోస్, అమర్‌దీప్, అయ్యప్ప పి శర్మ, మానస్, ‘బాహుబలి’ ప్రభాకర్, అభినయ, విద్యుల్లేఖ రామన్, ‘ఛత్రపతి’ శేఖర్, సూర్య, నళిని, శరధ్ దంగర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓక్ ఎంటర్‌టైన్మెంట్‌పై ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి ఈ సిరీస్‌ను నిర్మించారు. వికాశ్ బాదిషా సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించాయి. ఇక బుధవారం విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

దేశద్రోహిగా ముద్రపడిన తండ్రి నిజాయతీని నిరూపించే కూతురిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. ఆమె తల్లిదండ్రులుగా సత్యరాజ్, తులసి నటించారు. దేశ సంపదను దోచుకుని కనిపించకుండా పోయాడని సత్యరాజ్‌పై నిందపడుతుంది. ఆయన మ్యాన్షన్ హౌస్‌కి వెళ్లిన తరవాత నుంచీ కనిపించకుండా పోవడాన్ని వరలక్ష్మీ శరత్‌కుమార్ ట్రైలర్‌లో హైలైట్ చేస్తున్నారు. అయితే, అక్కడికి వెళ్లి కనిపించకుండా పోయారంటే ఇక ఆయన గురించి మరిచిపోవడం మంచిదని పోలీసులు సహా అందరూ సలహా ఇవ్వడం ఆసక్తికర అంశం. ఇంతకీ ఆ మ్యాన్షన్ హౌస్‌లో ఏముంది? తన తండ్రి ఏమయ్యారు? అనే విషయాలు తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.