Site icon HashtagU Telugu

Manchu Vishnu Vs Manoj : ‘దొంగప్ప’ రిలీజ్ అంటూ విష్ణు పై రివెంజ్ మొదలుపెట్టిన మంచు మనోజ్

Manchu Manoj Vishnu

Manchu Manoj Vishnu

మంచు ఫ్యామిలీ (Manchu Family) లో గొడవలు మరోసారి వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మంచు బ్రదర్స్ (Manchu Brothers) మధ్య ఆస్తుల గొడవలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసుకోవడం , ఒకరిపై ఒకరు దాడులకు దిగడం వంటివి చేసుకున్నారు. ఈ తరుణంలో మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. “ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న విడుదల కానుంది” అనే ప్రకటనతో పాటు “100 కోట్ల బడ్జెట్‌లో 80 శాతం ViSmith కమీషన్” అనే వ్యాఖ్యలు నేరుగా మంచు విష్ణును లక్ష్యంగా చేసుకుని చేసినవని అర్ధం అవుతుంది.

Trump Tariff: ట్రంప్ సుంకాల వెనుక ఉన్న ఉన్న‌ది ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఎవరి మాటలను పాటిస్తున్నారు?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంపై మనోజ్ తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. “జూన్ 27నా? జులై 17నా?” అంటూ ఎద్దేవా చేసారు. మంచు మనోజ్ ట్వీట్‌ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత వైరం వల్లే చేసారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి గత కొద్దీ నెలలుగా నడుస్తున్న ఈ వార్ కు త్వరగా ఫుల్ స్టాప్ పడితే బాగుండని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.