Manchu Manoj : కవల పిల్లల ఫై మనోజ్ క్లారిటీ..

హీరో మంచు మనోజ్ (Manchu Manoj) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి (Bhuma Maunika Reddy ) త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది (Birth to a child). తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ లోపే మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు […]

Published By: HashtagU Telugu Desk
Bhuma Mounika

Bhuma Mounika

హీరో మంచు మనోజ్ (Manchu Manoj) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి (Bhuma Maunika Reddy
) త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది (Birth to a child). తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ లోపే మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త (birth of Twins) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈక్రమంలో హీరో మనోజ్ ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు.

‘నా సతీమణి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. కవలలు పుట్టినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మా ఆనందాన్ని మీతో పంచుకుంటాం’ అని మనోజ్ ట్వీట్ చేశారు. దీంతో కవలలు అనే వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానికి ముందు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక మౌనికకు ఇప్పటికే ధైరవ్ అనే బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలోనే ధైరవ్‌ బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని ప్రకటించాడు మనోజ్. ఇక ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుంది మౌనిక. ఇక సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించని మంచు మనోజ్ త్వరలోనే వాట్‌ ది ఫిష్‌ అనే మూవీతో మన ముందుకు వస్తున్నాడు. మెగా డాటర్ నిహారిక ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే ఈటీవీ విన్‌లో ఉస్తాద్‌ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు మనోజ్.

Read Also : Congres 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

  Last Updated: 12 Mar 2024, 07:45 PM IST