Manoj Bajpayee : అక్కడ మద్యం ఫ్రీ అని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేసిన మనోజ్‌ బాజ్‌పాయ్.. ఎక్కడో తెలుసా?

ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ అక్కడ మద్యం ఫ్రీగా లభిస్తుందని తెలిసి పెగ్గు మీద పెగ్గు లేపేశారంట.

Published By: HashtagU Telugu Desk
Manoj Bajpayee drinking too much unlimited alcohol at that time

Manoj Bajpayee drinking too much unlimited alcohol at that time

బాలీవుడ్(Bollywood) నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌(Manoj Bajpayee) తన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సత్య(Satya) సినిమాతో స్టార్ యాక్టర్ అయ్యాడు. అల్లు అర్జున్ – హ్యాపీ అండ్ వేదం, పవన్ కళ్యాణ్ – పులి సినిమాల్లో నటించి తెలుగు వారిని అలరించారు.

మనోజ్ కెరీర్ స్టార్టింగ్ లో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్న సమయంలో ఓ ఈవెంట్ లో భాగంగా ఫస్ట్ టైం పారిస్ వెళ్లాల్సి వచ్చింది. అదే మనోజ్ తొలి అంతర్జాతీయ పర్యటన. ఆ ప్రయాణంలో భాగంగా విమానం ఎక్కిన మనోజ్ ఫ్లైట్ లో మందు సర్వ్‌ చేస్తారని అప్పుడే తెలిసిందట. మందు తాగాలని ఉన్నా, ఖర్చు ఎక్కువ ఉంటదేమో అని తగలేదట. అయితే పారిస్ లో విమానం దిగాకా విమానంలో సర్వ్ చేసే మందు ఫ్రీ అని తెలిసిందట.

ఇక ఏముంది తిరుగు ప్రయాణంలో తాగడమే పనిగా పెట్టుకున్నారట. పెగ్గు మీద పెగ్గు లేపేస్తు ఎంత తాగుతున్నారో కూడా తెలియకుండా తాగేశారట. ఆ తరువాత చాలా సేపటి వరకు స్పృహ కోలుపోయారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మనోజ్‌ బాజ్‌పాయ్ తెలియజేస్తూ అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. మనోజ్‌ ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ (Family Man) అనే వెబ్ సిరీస్ లో నటించి సూపర్ స్టార్‌డమ్ ని అందుకున్నారు. ఇప్పటికి 2 సిరీస్ లు ఆడియన్స్ ముందుకు రాగా.. మూడో సిరీస్ కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.

 

Project K Title: ప్రాజెక్ట్K అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్… ఎప్పుడంటే!

  Last Updated: 22 Jun 2023, 07:14 PM IST