ప్రస్తుతం టాలీవుడ్ రీ రిలీజ్ (Re Release ) ట్రెండ్ నడుస్తుంది. అగ్ర హీరోల సూపర్ హిట్ చిత్రాలే కాక ప్లాప్ చిత్రాలను సైతం థియేటర్స్ లలో రీ రిలీజ్ చేస్తూ..అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , వెంకటేష్ , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ,ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేయగా..ఇక ఇప్పుడు టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
2002 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన చిత్రం మన్మధుడు (Manmadhudu ). డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా… బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాకు త్రివిక్రమ్ అందించిన మాటలు , స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవి శ్రీ మ్యూజిక్ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది. అలాగే నాగ్ పంచ్ డైలాగ్స్ , సోనాలి గ్లామర్ , విజయ భాస్కర్ మార్క్ డైరెక్షన్ ఇవన్నీ కూడా సినిమా విజయంలో పాలుపంచుకున్నాయి. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రాన్ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే (Nagarjuna Birthday) సందర్బంగా ఆరోజున ఈ మూవీ ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ‘మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోడానికి కింగ్ వస్తున్నాడు’ అంటూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున సినీ కెరియరే కాడు చైతు , అఖిల్ కెరియర్ కూడా పెద్దగా లేదు. వరుస సినిమాలు భారీ డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ క్రమంలో మన్మధుడు సినిమా అభిమానులకు కాస్త రిలాక్స్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.
Read Also : RGV : చిరంజీవికి సపోర్ట్ పలికిన వర్మ..వీడు ఎవడికి అర్ధం కాడు