Site icon HashtagU Telugu

Manisha Koirala : ఆ ఒక్క విషయం తన జీవితాన్ని నాశనం చేసిందంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాల..

Manisha Koirala said about her life sad things how change her life to bad situations

Manisha Koirala said about her life sad things how change her life to bad situations

నేపాలీ(Nepali) భామ మనీషా కొయిరాలా(Manisha Koirala) ఇండియాలో ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంది. 1989 లో ‘ఫెరి భతౌలా’ అనే నేపాలీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. ఆ తరువాత రెండో సినిమా 1991లో ‘సౌదాగర్‌’ అనే బాలీవుడ్ సినిమా చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక అక్కడి నుంచి సౌత్ టు నార్త్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ సూపర్ స్టార్‌డమ్ ని అందుకుంది. అయితే ఈ అమ్మడి కెరీర్ నే కాదు, జీవితాన్ని కూడా ఒక విషయం పూర్తిగా నాశనం చేసేసింది అంటూ స్వయంగా తానే చెప్పుకొస్తుంటుంది.

హీరోయిన్ ఆఫర్స్ తగ్గిన సమయంలో మనీషా మద్యానికి బాగా బానిసైంది. అప్పటిలో మనీషా మద్యం మత్తులో ఉన్న వీడియో ఒకటి బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. మద్యం మత్తులో ఉన్న తనని మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుంటే.. ఆమె వద్దంటూ వేడుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ అలవాటు వల్ల తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు మనీషా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమస్యలు వచ్చినప్పుడు మద్యం సేవించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, ఆ మద్యం మన జీవితానే కాకుండా మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల జీవితాలు కూడా నాశనం చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.

2010లో మనీషా నేపాలీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకుంది. అయితే రెండేళ్లకే వీరి వివాహబంధం విడాకులతో ముగిసిపోయింది. కాగా మనీషా సౌత్ ఇండస్ట్రీలోకి నాగార్జున ‘క్రిమినల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’తో సౌత్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఒకే ఒక్కడు, భారతీయుడు అంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తూ వస్తుంది. ఇక మధ్యలో క్యాన్సర్ కి గురై కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. క్యాన్సర్ తో పోరాడి నిలిచింది.

 

Also Read : Ketika Sharma : కేతిక శర్మ స్టేట్ లెవెల్ ఛాంపియన్ అంట.. ఏ గేమ్‌లోనో తెలుసా? మరి సినిమాల్లోకి ఎలా?