Dil Se : ‘దిల్‌ సే’ సినిమాకి మనీషా కొయిరాలా మొదటి ఛాయస్ కాదట.. ఆ స్టార్ హీరోయిన్..!

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా 'దిల్ సే' (Dil Se). రొమాంటిక్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో మనీషా కొయిరాల హీరోయిన్ గా నటించింది.

Published By: HashtagU Telugu Desk
Dil Se Movie Interesting Facts about Heroine Manisha Koirala

Dil Se Movie Interesting Facts about Heroine Manisha Koirala

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా ‘దిల్ సే’ (Dil Se). రొమాంటిక్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో మనీషా కొయిరాల హీరోయిన్ గా నటించింది. మరో భామ ప్రీతిజింటా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. 1998లో రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.28 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న మనీషా కొయిరాలకి(Manisha Koirala) ఈ మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచింది.

ఈ సినిమాతో నార్త్ టు సౌత్ ఆడియన్స్‌ని, దర్శకనిర్మాతల దృష్టిని మనీషా ఆకర్షించింది. దీంతో వరసపెట్టి ఆఫర్స్ వచ్చాయి. ఒకానొక స్టేజిలో ఇండియన్ టాప్ యాక్ట్రెస్ గా నిలిచింది. దిల్ సే సినిమా మనీషాకి అంతటి ఫేమ్ ని సొంతం చేసింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటి ఎంపిక మనీషా కాదట. ఈ భామ కంటే ముందు మణిరత్నం మరో హీరోయిన్ ని సంప్రదించాడట. ఆమె నో అనడంతో ఆ ఛాన్స్ మనీషాకి వచ్చింది.

ఆల్రెడీ 1995లో షారుఖ్ ఖాన్ పక్కన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ మనసు గెలుచుకున్న హీరోయిన్ ‘కాజోల్’. ఈ చిత్రంలో వీరిద్దరి జంట ప్రతి ఒక్కర్ని ఆకట్టుకొని బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అనిపించుకుంది. దీంతో దిల్ సే కూడా ఆ కాంబినేషనే రిపీట్ చేస్తే.. లవ్ స్టోరీకి ఆడియన్స్ మరింత కనెక్ట్ అవుతారని మణిరత్నం భావించాడట. ఈ ఆలోచనతోనే కాజోల్ ని కూడా సంప్రదించాడు. కానీ ఆమె ఏవో కారణాలతో నో చెప్పడంతో మనీషా ఆ స్థానంలోకి వచ్చింది. దీంతో మనిషా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

  Last Updated: 28 Oct 2023, 08:33 PM IST