సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమధ్యనే వేట్టయ్యన్ తో ప్రేక్షకుల ముందుకు వచారు. ఆ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు రజినికాంత్. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా వస్తుంది. ఆ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. రజిని కూలీ (Coolie)లో కింగ్ నాగార్జున (Nagarjuna) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే సూపర్ స్టర్ రజినికాంత్ (Rajinikanth,) మణిరత్నం డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని కోలీవు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మణిరత్నం కమల్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నాఉ. ఆ సినిమా పూర్తి కాగానే రజినితో సినిమా ఉంటునని అనుకున్నారు. కానీ రజిని, మణిరత్నం సినిమా అసలు డిస్కసన్ లోనే లేదని క్లారిటీ ఇచ్చారు మణిరత్నం భార్య సీనియర్ నటి సుహాసిని.
ఆ రూమర్స్ ని సృష్టించారని..
ఈమధ్య మీడియా ముందుకు వచ్చిన ఆమె రజిని, మణిరత్నం (Maniratnam) కాంబో సినిమా గురించి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.కేవలం కొందరు కావాలని ఆ రూమర్స్ ని సృష్టించారని అన్నారు. రజినికాంత్, మణిరత్నం ఈ కాంబో చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాంటి కలయిక నిజం అవుతుందని అనుకున్న ఫ్యాస్ ని హర్ట్ చేసింది.
రజిని మణిరత్నం కలయికలో సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుని. మరి ఇప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్ లో అయినా ఈ కాంబో సినిమా వస్తునేమో చూడాలి.