Manchu Vishnu : తెలుగు పరిశ్రమ 90 ఏళ్ళ సినీ ఉత్సవం.. మంచు విష్ణు ఆధ్వర్యంలో.. ఎక్కడో తెలుసా?

మలేషియాలో నవతిహి ఉత్సవం పేరిట ఈ 90 ఏళ్ళ తెలుగు పరిశ్రమ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నాము.

Published By: HashtagU Telugu Desk
Manchu Visshnu planning 90 Years Telugu Film Industry Event at Malaysia

Manchu Visshnu planning 90 Years Telugu Film Industry Event at Malaysia

గతంలో తెలుగు సినీ పరిశ్రమ(Tollywood) 75 ఏళ్ళ ఉత్సవాలని వజ్రోత్సవం పేరిట ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు సినీ పరిశ్రమలోని నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, అన్ని క్రాఫ్ట్స్ లోని ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా 90 ఏళ్ళ వేడుకని నిర్వహించబోతున్నారు త్వరలో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా'(Movie Artist Association) తరపున మలేషియాలో జులైలో త్వరలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

నేడు ఈ ఈవెంట్ గురించి అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించగా మంచు విష్ణు, శివ బాలాజీ, మా సభ్యులతో పాటు పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో మంచు విష్ణు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని అనుకున్నాం. చెస్తే ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా చేయాలని అనుకున్నాం. అందుకే ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బిగ్గెస్ట్ ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. సినీ పరిశ్రమ పెద్దలతో‌ మాట్లాడి త్వరలోనే డేట్ ని ఎనౌన్స్ చేస్తాము. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు గోల్డెన్ ఎరా నడుస్తుంది. తెలుగు నటుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. తెలుగు సినిమా ఘనకీర్తిని ప్రపంచానికి తెలియచేసేలా ఈ ఈవెంట్ ను చేయబోతున్నాము. మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావడం, జై బాలయ్య అని ప్రపంచమంతా వినపడటం, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ రావడం, ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ అవ్వడం, మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతుండడం, కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ తీసుకురావడం.. ఇలా తెలుగు పరిశ్రమ ఎన్నో ఘన విజయాలు సాధిస్తుంది. ఈ ఈవెంట్ ని చేయడానికి ఇదే అసలైన సమయం. ఆ ఈవెంట్ కోసం సినీ పరిశ్రమకు రెండు రోజులు సెలవులు కూడా ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ ని కోరాము. ఈ ఈవెంట్ తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాము. మలేషియాలో నవతిహి ఉత్సవం పేరిట ఈ 90 ఏళ్ళ తెలుగు పరిశ్రమ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నాము. దీనికి మన నటీనటులే కాక వేరే పరిశ్రమల నటీనటులు కూడా రాబోతున్నారు అని తెలిపారు.

అలాగే ఈ ఈవెంట్ కి సపోర్ట్ చేస్తున్న మలేషియన్ టూరిజం డిపార్ట్మెంట్ కి, మలేషియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు మంచు విష్ణు. దీంతో మరోసారి తెలుగు పరిశ్రమని ఒకే వేదికపై చూడొచ్చని అభిమానులు, సినీ ప్రేమికులు భావిస్తున్నారు.

 

Also Read : Hanuman : ఓటీటీలో దుమ్ముదులుపుతున్న ‘హనుమాన్’

  Last Updated: 23 Mar 2024, 01:57 PM IST