Site icon HashtagU Telugu

Manchu Vishnu: మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్… ట్రోల్స్ వెనకాల ఆ స్టార్ హీరో కుట్ర..ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!!

Manchu Vishnu Imresizer

Manchu Vishnu Imresizer

హీరో మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై వస్తోన్న ట్రోల్స్ వెనకాల…ఓ అగ్రహీరో ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ…షాక్ ఇచ్చాడు మంచు విష్ణు. తాజాగా జిన్నా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ…ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. తన పై వస్తోన్న ట్రోల్స్ వెనకాల అగ్ర హీరో ఉన్నాడంటూ దూమారం రేపాడు. అంతేకాదు ఆ హీరో సాఫ్ట్ వేర్ కంపెనీని నడిస్తున్నాడని అన్నాడు. ఆ హీరో వివరాలను బటయపెట్టాడు. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో 21 మంది ఉద్యోగులకు పెట్టి…తనను టార్గెట్ చేసేందుకు నియమించారన్నారు. ఆ ఆఫీస్ కు సంబంధించిన అడ్రెస్, ఐపీ తనకు లభించినట్లు చెప్పుకొచ్చాడు. 85శాతం ట్రోల్స్ అక్కడి నుంచే వస్తున్నట్లు తెలిపారు.

ఇక 18 యూట్యూబ్ చానెల్స్ పై చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. వారిపై గురువారం కోర్టులో కేసు వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తన సినిమా రిలీజ్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిగ్గా మారింది. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ట్రోల్స్ చేసేందుకు చాలా మంది నెటిజన్లు ఉన్నారు. ప్రత్యేకించి ఓ ఐటీ కంపెనీని నడిపించే ఆలోచన ఏ హీరో చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రోల్స్ చేసేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టింది ఎవడ్రా అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.