Site icon HashtagU Telugu

Manchu Vishnu : కల్కిని చూశావా కన్నప్పా..?

Kannappa

Kannappa

Manchu Vishnu ఈమధ్య తెలుగు తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు మన మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. కల్కి లాంటి కథ రాయడం ఒక ఎత్తైతే ఆ సినిమాను అదే రేంజ్ లో తెరకెక్కించడం అనేది మరో గొప్ప విషయం. ఈ విషయంలో నాగ్ అశ్విన్ కి 100కి 100 మార్కులు వేయాల్సిందే. ఐతే కల్కి లాంటి సినిమా కాకపోయినా మంచు విష్ణు కన్నప్ప అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కన్నప్ప కోసం మంచు ఫ్యామిలీ చాలా కష్టపడుతుంది.

సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమర్, మోహన్ లాల్ ఇలాంటి స్టార్స్ అంతా కూడా నటిస్తున్నారు. ఐతే కల్కి సినిమా చూసిన ఆడియన్స్ కన్నప్ప ని కూడా అదే రేంజ్ లో ఊహించుకుంటారు. రీసెంట్ గా రిలీజైన కన్నప్ప టీజర్ విమర్శలు అందుకుంది. మంచు విష్ణు కోట్లు ఖర్చు పెడుతున్నాడు కానీ సినిమా అంత ఇంపాక్ట్ అనిపించట్లేదని నెటిజెన్లు అంటున్నారు.

ఐతే సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి కల్కి చూసిన తర్వాత అయినా మంచు విష్ణు తన ప్రాజెక్ట్ మీద ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తాడేమో చూడాలి. ఒకవేళ కన్నప్ప టీజర్ లానే సినిమా అవుట్ పుట్ కూడా ఉంటే మాత్రం సినిమాను మంచు విష్ణుని దారుణంగా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంపై మంచు విష్ణు ఆలోచన ఎలా ఉందో కన్నప్పకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో తెలియాల్సి ఉంది.

Also Read : Rashmika Mandanna : ఏదేమైనా డిమాండ్ అంటే రష్మికదే..!

Exit mobile version