Manchu Vishnu – Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో.. నటి హేమకు మంచు విష్ణు మద్దతు..

ఇటీవల బెంగుళూర్ లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఆ విషయంలో నటి హేమకు మంచు విష్ణు మద్దతు..

  • Written By:
  • Publish Date - May 26, 2024 / 07:42 AM IST

Manchu Vishnu – Hema : ఇటీవల బెంగుళూర్ లో జరిగిన రేవ్ పార్టీ (Bangalore Rave Party) టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఆ పార్టీలో టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. ఈక్రమంలోనే ప్రథంగా నటి హేమ పేరు గట్టిగా వినిపించింది. అయితే ఆమె మాత్రం ఆ పార్టీలో పాల్గొనలేదని చెప్పుకొస్తూ.. ఒకటి రెండు వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం.. హేమకు కూడా నోటీసులు పంపించడం గమనార్హం.

దీంతో హేమ పేరు తెలుగు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు హేమ డ్రగ్స్ కేసు పై అనేక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. హేమనే రేవ్ పార్టీ నిర్వహించినట్లు, ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ నమూనాలు దొరికాయంటూ వార్తలు రాసుకొస్తున్నారు. ఇక ఈ వార్తలు పై టాలీవుడ్ MAA అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. నటి హేమకు మద్దతుగా మాట్లాడారు.

“ఇటీవల బెంగుళూర్ లో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. సరైన సమాచారం లేకుండా ఆ వార్తలను ధృవీకరిస్తూ.. తెలిసి తెలియని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. నటి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలని కోరుతున్నాను.

ఎందుకంటే ఆమె కూడా ఒక తల్లి మరియు భార్య. ఎటువంటి నిర్దారణ లేని పుకారులతో ఆమె ఇమేజ్‌ను దూషించడం అన్యాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎప్పుడు ఖండిస్తుంది. హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను పోలీసులు అందజేస్తే, MAA అసోసియేషన్ సైతం తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం కలిగించకుండా ఉండండి” అంటూ ట్వీట్ చేసారు.