Site icon HashtagU Telugu

Bhakta Kannappa : భక్త కన్నప్ప బడ్జెట్ 150 కోట్లు..? న్యూజిలాండ్‌లో షూటింగ్..?

Manchu Vishnu says Bhaktha Kannappa Movie Shooting in New Zealand with 150 crore Budget

Manchu Vishnu says Bhaktha Kannappa Movie Shooting in New Zealand with 150 crore Budget

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ ‘భక్త కన్నప్ప’(Bhakta Kannappa). చాలా కాలంగా ఈ సినిమా చేయాలని అనుకోని తాజాగా నేడు శ్రీకాళహస్తిలో(Srikalahasti) పూజా కార్యక్రమాలతో ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు(Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నూపుర్ సనన్(NupurSanon) నటిస్తుంది.

అయితే ఈ భక్త కన్నప్ప సినిమా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చాలా మంది సౌత్ స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్ లు ఉంటాయి. సినిమాను ఐదు భాషల్లో నిర్మిస్తున్నాం. షూటింగ్ మొత్తం న్యూజిలాండ్(New Zealand) లో జరగనుంది అని చెప్పారు

దీంతో మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అడవిలో, గుళ్ళ దగ్గర తీయాల్సిన సినిమా న్యూజిలాండ్ లో తీయడమేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడి నేటివిటీలో తీయాల్సిన సినిమాకు న్యూజిలాండ్ కి వెళ్లడం ఎందుకు అని అంటున్నారు. అలాగే మంచు విష్ణుకి అసలు 10 కోట్ల మార్కెట్ కూడా లేదు. 150 కోట్లు పెట్టి సినిమా తీయడం అవసరమా? ఇది వర్కౌట్ అవుతుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు విష్ణు భక్త కన్నప్పని ఎలా తీస్తాడో చూడాలి.

 

Also Read : Raasi: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఆయనతో నటించాలనేది నా కోరిక : హీరోయిన్ రాశి