Site icon HashtagU Telugu

Manchu Vishnu : రష్మిక ఫేక్ వీడియోపై ఫైర్ అయిన మంచు విష్ణు.. ‘మా’ తరపున పోరాడతాం..

Manchu Vishnu Reacts on Rashmika Mandanna Fake Video Issue

Manchu Vishnu Reacts on Rashmika Mandanna Fake Video Issue

గత మూడు రోజులుగా రష్మిక(Rashmika Mandanna) ఫేక్ వీడియో ట్రెండ్ అవుతూ, పలువురు అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు దీనిపై చర్చిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక ఫేక్ వీడియో వైరల్ అవ్వడంతో సినీ ప్రముఖులంతా సీరియస్ అవుతూ రష్మికకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, చిన్మయి, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్.. ఇలా అనేకమంది సినీ పరిశ్రమ వాళ్ళు స్పందించారు.

తాజాగా నటుడు, మా(MAA) అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కూడా రష్మిక ఫేక్ వీడియోపై స్పందించి ఫైర్ అవుతూ ట్వీట్ చేశాడు.

మంచు విష్ణు తన ట్వీట్ లో.. నేను రష్మికను సపోర్ట్ చేస్తున్నాను. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ‘మా’ అసోసియేషన్ టెక్నాలజీని మిస్ యూజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ‘మా’ అసోసియేషన్ లీగల్ టీం, AI డెవలపర్స్ తో ఇలాంటి సమస్యల గురించి చర్చిస్తుంది. రష్మిక విషయంలో అర్జెంట్ గా చర్యలు తీసుకోవాలి. ‘మా’ అసోసియేషన్ కూడా ఏ యాక్టర్ కి ఇలా జరిగినా దీనిపై పోరాడుతుంది. పక్క రాష్ట్రాల నటులతో కూడా దీని గురించి చర్చిస్తాం. సినీ పరిశ్రమలో ఉన్న వారి గౌరవం కోసం మేము పనిచేస్తాము అంటూ పోస్ట్ చేశాడు.

 

Also Read : Sankranthi Movies : సంక్రాంతి బరిలో ఇంకో సినిమా.. బాబోయ్ సంక్రాంతికి ఇన్ని సినిమాలా?