Kannappa Teaser : మంచు విష్ణు కన్నప్ప టీజర్ లాంచ్.. శివుడు పాత్రలో ఎవరో తెలుసా..?

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న మంచు విష్ణు కన్నప్ప టీజర్ వచ్చేసింది. శివుడు పాత్రలో ఎవరో తెలుసా..?

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 03:32 PM IST

Kannappa Teaser : మంచు విష్ణు హీరోగా బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి శివక్షేత్రం చరిత్ర ఆధారంగా శివుడి మహాభక్తుడైన కన్నప్ప కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. 48ఏళ్ళ క్రిందట ఇదే కథతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత మంచు విష్ణు మెయిన్ లీడ్ లో కన్నప్ప తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ప్రమోషన్స్ ని కూడా నిర్వహిస్తూ వస్తుంది.

ఈక్రమంలోనే ఈ టీజర్ ని గత నెలలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అయిన ‘కాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో స్క్రీనింగ్ చేసారు. అక్కడ మంచి స్పందన వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. తాజాగా ఆ టీజర్ ని అందరి ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమాలో శివుడి పాత్రని ప్రభాస్ పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే రిలీజ్ చేసిన టీజర్ లో ఆ పాత్రని అక్షయ్ కుమార్ పోషించినట్లు తెలుస్తుంది. అయితే ఈ టీజర్ ని అఫీషియల్ గా ఇంకా రిలీజ్ చేయలేదు.

నేడు హైదరాబాద్ AMB మాల్ లో ప్రీమియర్ వేశారు. ఇక ఈ ప్రీమియర్ లో పాల్గొన్న అభిమానులు.. టీజర్ ని తమ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో లీక్ చేసేసారు. ఈ టీజర్ లోని లొకేషన్స్ హాలీవుడ్ సినిమాని గుర్తు చేస్తుంది. ఇక శివుడిగా అక్షయ్ కుమారుని చూపించిన మంచు విష్ణు.. ప్రభాస్ ని మాత్రం కేవలం కన్ను షాట్ తో చూపించి వదిలేసారు. మరి ఈ టీజర్ ని అఫీషియల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.