Manchu Vishnu Mega Plan for Kannappa : కన్నప్ప రేంజ్ పెంచుతున్న స్టార్ కాస్ట్.. మంచు విష్ణు మెగా ప్లానే వేశాడు..!

Manchu Vishnu Mega Plan for Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను 100 కోట్ల పైన బడ్జెట్ తో

Published By: HashtagU Telugu Desk
Manchu Vishnu Mega Plan for Kannappa Prabhas Akshay Kumar Mohan Lal

Manchu Vishnu Mega Plan for Kannappa Prabhas Akshay Kumar Mohan Lal

Manchu Vishnu Mega Plan for Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను 100 కోట్ల పైన బడ్జెట్ తో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఇప్పటికే ప్రభాస్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తున్నారన్న విషయం తెలుస్తుండగా లేటెస్ట్ గా సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కూడా తీసుకొచ్చారు.

సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపిస్తారని టాక్. ప్రభాస్ నందీశ్వరుడిగా నటిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా భాగం అవుతుందని తెలుస్తుంది. చూస్తుంటే మంచు విష్ణు చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడని అనిపిస్తుంది. ఇప్పటికే కన్నప్పలో స్టార్ కాస్ట్ భారీగా ఉండగా వీరితోనే ఆపుతాడా ఇంకా ఎవరినైనా తీసుకొస్తాడా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.

కెరీర్ లో పెద్దగా ఫాం లో లేని మంచు విష్ణు కన్నప్ప కోసం తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచు విష్ణు రేంజ్ పెంచే సినిమా అవుతుందని అంటున్నారు. మరి మంచు వారి ఈ కన్నప్ప వెండితెర మీద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

సినిమాను అసలైతే 100 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేయాలని ముందు అనుకున్నా పెరిగిన స్టార్ కాస్ట్ తో అది మరింత పెరుగుతుందని తెలుస్తుంది. కన్నప్పను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు ఈ స్టార్స్ ఇమేజ్ తో ప్రాజెక్ట్ పై భారీ హైప్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

Also Read : Businessman Raj Kundra : శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్‌.. కారణమిదే..?

  Last Updated: 18 Apr 2024, 04:27 PM IST