మంచు కుటుంబానికి చెందిన ఆస్తులపై జరుగుతున్న వివాదం (Manchu Family Controversy) మరోసారి చర్చనీయాంశమైంది. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ ఆ ఇంటిలో నివసిస్తున్న మంచు మనోజ్(Manchu Manoj)కు నోటీసులు పంపించారు. కాగా ఈరోజు మంచు మనోజ్ కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ ఆస్తుల వివరాలు, ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, వివాదాలపై చర్చించారు. మనోజ్ కలెక్టర్‌కు తన వాదనను వివరించి, తమ కుటుంబంలో చోటుచేసుకున్న సమస్యలపై స్పష్టమైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
Samsung : సరికొత్త 9KG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను విడుదల
మోహన్ బాబు తన ఆస్తుల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మేజిస్ట్రేట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో కూడా చర్చ జరిగింది. ఇక ఇంటిపై ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులు త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. న్యాయపరమైన పద్ధతుల్లో ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మోహన్ బాబు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనోజ్ ఇచ్చిన వివరణకు సంబంధించి అధికారులకు మరిన్ని ఆధారాలు సమర్పించాలని సూచించారని సమాచారం. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో మనోజ్ vs విష్ణు ల మధ్య వార్ తారాస్థాయికి వెళ్తుంది. ‘కుక్క’ అంటూ ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా ట్వీట్స్ చేసుకొని కాకరేపారు. ఓవరాల్ గా మాత్రం మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న ఈ గొడవలు సినీ ఇండస్ట్రీ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.