Manchu Vishnu Kannappa Release మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కన్నప్ప. కృష్ణం రాజు తీసిన భక్త కన్నప్ప కథను నేటి తరం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సినిమాను చేస్తున్న మంచు విష్ణు సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ కాగా బాలీవుడ్, శాండల్ వుడ్ స్టార్స్ కూడా భాగం అవ్వడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా చేస్తుంది.
సినిమాలో ఒక్కొక్కరిగా చేస్తూ కన్నప్ప మీద భారీ హైప్ తెస్తున్నారు. ఇదిలాఉంటే కన్నప్ప సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. తారాగణం చూస్తుంటే ఇదేదో పెను సంచలనం సృష్టించేలా ఉందని అనిపిస్తుంది. అందుకే ఏదో ఒక డేట్ న రిలీజ్ చేయడం అని కాకుండా మంచి ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది.
కన్నప్ప సినిమా ముందు దసరాకి రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా అప్పటికి పూర్తి కాదని తెలుస్తుంది. నవంబర్, డిసెంబర్ ఆల్రెడీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి కాబట్టి 2025 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే 2025 సంక్రాంతికి ఖర్చీఫ్ వేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటి మధ్య కన్నప్ప నిలబడతాడా అన్నది చెప్పడం కష్టం.
అందుకే కుదిరితే సంక్రాంతి లేదా 2025 సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మంచు విష్ణు కెరీర్ పరంగా వెనకపడ్డాడు. అందుకే కన్నప్ప నుంచి ఒక మంచి టీజర్ వదిలి సినిమాపై హైప్ తీసుకు రావాలని ట్రై చేస్తున్నాడు.
Also Read : Sudheer Babu Haromhara : సుధీర్ బాబు తగ్గక తప్పట్లేదా.. వాయిదా బాటలో హరోంహర..!