Site icon HashtagU Telugu

Kannappa Teaser : కన్నప్ప టీజర్ రిలీజ్ అప్డేట్.. ప్రభాస్‌ ‘కల్కి’ స్టైల్‌లో..

Manchu Vishnu Gave Kannappa Movie Teaser Update

Manchu Vishnu Gave Kannappa Movie Teaser Update

Kannappa Teaser : మంచు విష్ణు హీరోగా ప్రభాస్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి శివక్షేత్రం చరిత్ర ఆధారంగా శివుడి మహాభక్తుడైన కన్నప్ప కథని ఈ సినిమాలో చూపించబోతున్నారు. గతంలో ఈ కథతో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. టాలీవుడ్ లోని ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్రాన్ని.. ప్రభాస్ తో సహా చాలామంది రీమేక్ చేయాలని భావించారు.

అయితే ఆ అవకాశం మంచు విష్ణుని వరించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ ని జరుపుతూనే.. వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీని ఆడియన్స్ లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ని ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ని మే 20న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ఈ టీజర్ ని రిలీజ్ చేయడంలో ప్రభాస్ ‘కల్కి’ మూవీని ఫాలో అవుతున్నారు.

ప్రభాస్ కల్కి మూవీ టైటిల్ టీజర్ ని ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ కామిక్ కాన్ లో రిలీజ్ చేసారు. ఇప్పుడు కన్నప్ప మూవీ టీజర్ ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ లో రిలీజ్ చేయబోతున్న ఈ టీజర్‌లో.. ప్రభాస్ ని చూపించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడో ఈ టీజర్ తో రివీల్ చేస్తారేమో చూడాలి.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రని పోషించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ మరో పాత్రని ఎంచుకున్నాడని రీసెంట్ గా మంచు విష్ణు తెలియజేసారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ అంతా ఆ పాత్ర ఏమైంటుందని తెగ ఆలోచించేస్తున్నారు.