Site icon HashtagU Telugu

Kannappa : పుష్ప, గేమ్ ఛేంజర్‌కి పోటీగా మంచు విష్ణు ‘కన్నప్ప’..

Manchu Vishnu, Kannappa, Prabhas

Manchu Vishnu, Kannappa, Prabhas

Kannappa : మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. దాదాపు వందకోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. భక్తిరస చారిత్రాత్మక కథతో వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా.. ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా మంచు విష్ణు విడుదల తేదీ పై ఓ ప్రకటన చేసారు. ఈ సినిమాని ఈ డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నామంటూ ట్వీట్ చేసారు. కాగా డిసెంబర్ లో ఆల్రెడీ రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ లోనే రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

పుష్ప 2ని డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా డిసెంబర్ 20న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇలాంటి రెండు బడా ప్రాజెక్ట్స్ ని ఎదుర్కొని కన్నప్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని క్రియేట్ చేస్తుందో, అలాగే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ ఇమేజ్ కన్నప్పకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Exit mobile version