Site icon HashtagU Telugu

Manchu Manoj : యువ హీరోకి విలన్ అవుతున్న మంచు మనోజ్..?

Manoj Sympathy

Manoj Sympathy

మంచు మనోజ్ (Manchu Manoj) తన సెకండ్ ఇన్న్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈమధ్యనే ఉస్తాద్ అనే షోకి హోస్ట్ గా చేస్తుండగా త్వరలోనే వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. మంచు మనోజ్ చేసే సినిమాపై లేటెస్ట్ గా ఒక లీక్ బయటకు వచ్చింది. హీరోగా ఏమో కానీ మంచు మనోజ్ యువ హీరో సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని టాక్. నటుడు అన్న తర్వాత ఎలాంటి పాత్రలైనా చేయాల్సి ఉంటుంది. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని కసితో ఉన్న మనోజ్ ఈసారి హీరోగా కాదు విలన్ గా చేయాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో తేజా సజ్జ తో ఢీ కొడుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా ప్లానింగ్ లో ఉంది. సినిమాకు టైటిల్ గా మిరాయి అని ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని ఒకప్పటి డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య లీక్ చేశారు. లేటెస్ట్ గా ఈగల్ ఈవెంట్ కి వచ్చిన ఆయన కార్తీక్ ఈగల్, మిరాయి సక్సెస్ అవ్వాలని అన్నారు.

తేజ సజ్జ ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. హనుమాన్ హిట్ పడితే మాత్రం తేజ సజ్జ మంచు మనోజ్ చేసే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది.

Also Read : Salaar : సలార్ A సర్టిఫికెట్ ఎంత పని చేసింది..!

We’re now on WhatsApp : Click to Join