జేబులో చిల్లిగవ్వ లేకుండా మంచు మనోజ్ ప్రయాణం..అది కూడా భార్య తో కలిసి !!

గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఇప్పుడు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Manoj Auto Joureny

Manoj Auto Joureny

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన సహజసిద్ధమైన వ్యక్తిత్వం తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఇప్పుడు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి, సామాన్యుడిలా తన భార్యతో కలిసి ఆటోలో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రయాణానికి గల కారణాన్ని మనోజ్ వీడియోలో సరదాగా వివరించారు. ఉదయాన్నే జిమ్‌కు వెళ్దామని కారులో బయలుదేరగా, అనుకోకుండా కారు మధ్యలో ‘బ్రేక్ డౌన్’ అయ్యింది. చలికాలం కావడంతో వర్కౌట్ మిస్ అవ్వకూడదనే పట్టుదలతో, మనోజ్ ఏమాత్రం ఆలోచించకుండా కారు దిగి తన భార్యతో కలిసి ఆటో ఎక్కేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ సమయంలో తన జేబులో ‘చిల్లిగవ్వ’ కూడా లేదని, ఆటో వాడికి ఇచ్చేందుకు డబ్బులు లేకపోయినా ఏదోలా మేనేజ్ చేసి జిమ్‌కు చేరుకున్నామని ఆయన నవ్వుతూ చెప్పుకొచ్చారు.

Manchu Manoj

మనోజ్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు బయటకు వస్తే భారీ భద్రత, ఖరీదైన కార్లు ఉంటాయని, కానీ మనోజ్ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా భార్యతో కలిసి ఆటోలో ప్రయాణించడం ఆయనలోని సామాన్య కోణాన్ని ఆవిష్కరించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, జిమ్ మీద ఉన్న డెడికేషన్ మరియు మనోజ్ సింప్లిసిటీకి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచింది.

  Last Updated: 10 Jan 2026, 02:30 PM IST