Manchu Manoj : అరెస్టు చేయండి అంటూ అర్ధరాత్రి మంచు మనోజ్ హల్చల్

Manchu Manoj : సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ..పోలీస్ స్టేషన్ లో రచ్చ చేయడం ఇప్పుడు అందరు మాట్లాడుకునేలా చేసింది

Published By: HashtagU Telugu Desk
Manoj Ps

Manoj Ps

గత కొద్దీ రోజులుగా మంచు మనోజ్ (Manchu Manoj ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ లో నడుస్తున్న ఆస్తుల గొడవలు తారాస్థాయికి చేరుకోవడం తో వీరికి సంబదించిన ఏ విషయం బయటకు వచ్చిన అది వైరల్ గా మారుతుంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ..పోలీస్ స్టేషన్ లో రచ్చ చేయడం ఇప్పుడు అందరు మాట్లాడుకునేలా చేసింది.

మంచు మనోజ్ తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే రాత్రి గస్తీ నిర్వహిస్తున్న భాకరాపేట పోలీసులు రిసార్ట్‌ వద్ద ప్రైవేట్ బౌన్సర్లను గమనించి అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మనోజ్ స్వయంగా భాకరాపేట పోలీస్ స్టేషన్‌(Bhakarapeta Police Station)కు వెళ్లి, తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. “నన్ను అరెస్టు చేయండి, నన్ను ఎందుకు వేధిస్తున్నారో చెప్పండి” అంటూ పోలీసుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. “నేను టెర్రరిస్టానా? దొంగనా?” అంటూ ప్రశ్నించారు. అర్థరాత్రి తన వద్దకు పోలీసులను ఎందుకు పంపించారని “సీఎం పేరు చెప్పి బెదిరించడం ఏమిటి?” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిసార్ట్‌ వద్ద పోలీసుల రాకపై భాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మనోజ్ మాత్రం తనపై కావాలనే ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు చేశారు. నా రిసార్ట్‌కి అద్దె ఇవ్వొద్దని, హోటల్లో భోజనం పెట్టొద్దని బెదిరిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనికి ముందు రెండు రోజుల క్రితం మంచు మనోజ్ చంద్రగిరి మండలంలో నిర్వహించిన పశువుల పండుగలో పాల్గొన్నారు. మిట్ట గంగమ్మ గుడి వీధిలో నిర్వహించిన పండుగలో ఆయన సందడి చేశారు. పశువులను శుభ్రంగా అలంకరించి, వాటి కొమ్ములకు సినిమా హీరోలు, రాజకీయ నేతల చిత్రాలతో చెక్క పలకలను కట్టి వీధుల్లో వదిలారు. యువకులు వాటిని పట్టుకునేందుకు పోటీ పడటాన్ని మనోజ్ ఆసక్తిగా తిలకించారు.

  Last Updated: 18 Feb 2025, 12:28 PM IST