Site icon HashtagU Telugu

Manchu Manoj: మనోజ్ ప్లాన్ మాములుగా లేదుగా… భారీ మల్టీస్టారర్

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: మంచు మనోజ్.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవాడు. ఆతర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన కెరీర్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం బుల్లితెర పై హోస్ట్ గా సందడి చేస్తోన్న మంచు మనోజ్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ క్రేజీ మల్టీస్టారర్ ఏంటి.. ఇందులో నటించే హీరోలు ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. మంచు మనోజ్ చేసే మల్టీస్టారర్ లో ఇద్దరు యంగ్ హీరోలు నటించనున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కాగా, మరో యంగ్ హీరో టాలీవుడ్ హీరో తేజ సజ్జ. మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జ.. ఈ ముగ్గురు కాంబినేషన్లో సినిమా ఎప్పుడో సెట్ అయ్యిందట. మరో విశేషం ఏంటంటే.. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందట. ఇంతకీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరంటే.. ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని సమాచారం.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈగల్ కంటే ముందుగా ఈ సినిమానే కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే.. ఆ టైమ్ లో ఈగల్ మూవీ ఆఫర్ రావడం.. తేజ సజ్జ హనుమాన్ మూవీతో బిజీ కావడంతో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇది కూడా సూపర్ హీరో కథాంశంతో ఉంటుందట. మనోజ్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జ.. ఈ ముగ్గురు పాత్రలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని.. ఈ సినిమా ఆడియన్స్ థ్రిల్ కలిగించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ సినిమాతో మంచు మనోజ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read: Floating Airport: మునిగిపోతోన్న జపాన్‌లోని ఫ్లోటింగ్ ఎయిర్‌పోర్ట్.. 7 సంవత్సరాలు పట్టింది రెడీ చేయటానికి..!