Site icon HashtagU Telugu

Manchu Manoj Mirai : మిరాయ్ మంచు హీరో ఒక మంచి నిర్ణయం..!

Manchu Manoj Apologies

Manchu Manoj Apologies

Manchu Manoj Mirai మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి కెరీర్ మొదట్లోనే సత్తా చాటిన హీరో మంచు మనోజ్ రాకింగ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మంచు మనోజ్ దాదాపు ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. పర్సనల్ లైఫ్ డిస్టబన్స్ వల్ల సినిమాలకు దూరమైన మంచు మనోజ్ ఇన్నాళ్లకు మళ్లీ తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. మంచు మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్ తో పాటుగా మిరాయ్ సినిమాలో నటిస్తున్నాడు.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలో తేజా సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా మంచు మనోజ్ కి సంబందించిన వీడియో ఒకటి రిలీజైంది. మిరాయ్ మనోజ్ టీజర్ చూసిన మంచు ఫ్యాన్స్ అంతా సూపర్ అనేస్తున్నారు.

మంచు మనోజ్ కి కామన్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్నా మంచు మనోజ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని సూపర్ హిట్ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు. హనుమాన్ తో సూపర్ హిట్ అందుకున్న తేజా సజ్జ మిరాయ్ తో కూడా మరో బ్లాక్ బస్టర్ మీద గురి పెట్టాడు. మంచు మనోజ్ ఈ సినిమాలో మేజర్ హైలెట్ గా నిలుస్తాడని చెప్పొచ్చు.

మిరాయ్ హిట్ పడింది అంటే మంచు మనోజ్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. మిరాయ్ టీజర్స్ అయితే సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని రివీల్ చేశాడు మంచు మనోజ్.

Also Read : Ashu Reddy : ఫోటోలే కాదు అషు కామెంట్స్ కూడా రెచ్చగొట్టేస్తున్నాయ్..!