Site icon HashtagU Telugu

Manchu Manoj : మంచు మనోజ్ కు సపోర్ట్ గా నిలుస్తున్న నెటిజన్లు

ఇటీవల సోషల్ మీడియా (Social Media) వాడకం బాగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో..అంతకు రెట్టింపు చెడు జరుగుతుంది. ముఖ్యముగా చిన్నారుల పట్ల సోషల్ మీడియా ముసుగులో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులతో చేయించారని పలు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఆనందం చెందుతున్నారు. ఇలాంటి వీడియోస్ ఫై నెటిజనులు ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చిన్నారులతో వీడియోస్ చేయించకూడదని..ఏదైనా సరదా వీడియోస్ తీస్తే తప్పులేదు కానీ వారితో పనులు చేయించడం, అసభ్యకరమైన వీడియోస్ చేయించడం వంటివి చేస్తూ కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి వీడియోస్ ఫై తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కొందరు వ్యక్తలు చిన్నారుల విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తుంటారని, వాళ్లని లైంగికంగా వేధిస్తుంటారని కామెంట్స్ చేశారు. మరి కొందరు ఏకంగా చిన్నారులపైనే అసభ్యకరమైన వీడియోలు చేస్తుంటారని పైగా సోషల్ మీడియాలో లైక్ చెయ్యమంటూ పోస్టింగులు చేస్తుంటారని, హాస్యం ముసుగేసి చిన్నారులతో వాళ్ల నోటి వెంట బూతులు మాట్లాడిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. అలాంటి వీడియోలు చిన్నారులపై విషప్రభావం చూపుతాయని అన్నారు. తరచుగా ఇలాంటివి పోస్టింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు మనోజ్. అమ్మ తోడు నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ హెచ్చరిక జారీ చేసారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఎక్కువైపోతున్నాయని..వీటిని అరికట్టాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలదే అని అన్నారు. దయచేసి ఇలాంటి విషయాలపై ఎలాంటి అలసత్వం వద్దు అని , ఇలాంటి చర్యలకు పాల్పడే నిందితులు ఏ ఒక్కరినీ ఉపేక్షించవద్దని కోరారు. అలాగే పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి అలాంటి పోస్టింగులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మనోజ్ రియాక్ట్ ఫై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Lord Shiva : ‘3’ సంఖ్యతో పరమశివుడికి ప్రత్యేక అనుబంధం!