Site icon HashtagU Telugu

Manchu Manoj : నడవలేని స్థితిలో మంచు మనోజ్..అంత దారుణంగా కొట్టడమేంటి..?

Manoj Hsp

Manoj Hsp

మోహన్ బాబు – మనోజ్ (Mohanbabu Manoj-) కొట్లాట..ఇప్పుడు చిత్రసీమలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు దూరంగా ఉండే మంచు ఫ్యామిలీ..ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకోవడం..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం పై అంత మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ నెలలుగా మంచు మనోజ్ -vs – విష్ణు ల మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రితమే మనోజ్ అనుచరుడి పైన విష్ణు దాడి చేయడం, ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు అతిధి గానే వచ్చి వెళ్లిపోవడం… ఆలీతో సరదాగా కార్యక్రమంలో అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఉన్న గొడవలపై క్లారిటీ ఇవ్వమని హోస్ట్ ఆలీ ప్రశ్నించగా.. తాను వేసుకున్న కోట్ కూడా విప్పుతూ సీరియస్ అయిపోయారు మంచు విష్ణు. మా ఇంట్లో గొడవలు బయట వాళ్లకి ఎందుకట అంటూ ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే గొడవలు ఉన్నాయనే వార్తలు చాలావరకు స్పష్టమయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా మనోజ్ హాస్పిటల్ లో చేరడంతో అందరూ కన్ఫామ్ అవుతున్నారు.

మంచు మనోజ్, మంచు మోహన్ బాబు విద్యాసంస్థల లో కీలకంగా పని చేసే వినయ్(Vinay) అనే వ్యక్తి రౌడీలతో కలిసి తన తండ్రి ప్రమేయంతో దాడి చేసినట్లు గాయాలతోనే పిఎస్ మెట్లు ఎక్కి మంచు మనోజ్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వినయ్ తో పాటు మరికొంతమంది తనను కొట్టారని అంతే కాదు తనతో పాటు తన భార్య భూమా మౌనిక రెడ్డి(Mounika Reddy) పై కూడా చేయి చేసుకున్నారని మంచు మనోజ్ తన ఫిర్యాదులో తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు మంచు మనోజ్ ను ఆసుపత్రిలో చేర్పించారు. బంజారాహిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్ లో మనోజ్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన భార్య భూమా మౌనిక మరి కొంతమంది సహాయంతో ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యంగా కాళ్లకు బలమైన గాయం అవ్వడంతో మనోజ్ కి వైద్యులు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ చూసిన వారంతా ఆస్తుల కోసం ఎంతగా కొట్టాలా..? అసలు మనుషులేనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..