Site icon HashtagU Telugu

Manchu Manoj : వెంకటేష్ సినిమాలో మంచు హీరో.. మంచి రోజులు వచ్చినట్టేనా..?

Manchu Manoj Apologies

Manchu Manoj Apologies

Manchu Manoj విక్టరీ వెంకట్ష్ ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత మళ్లీ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తుండగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందని ఎప్పటి నుంచో వినపడుతున్న టాక్.

అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ లేటెస్ట్ గా ఆ రోల్ కి మంచు హీరో మనోజ్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు మనోజ్ తన సినిమాలతో సెపరేట్ క్రేజ్ దక్కించుకున్నాడు. రాకింగ్ స్టార్ గా మంచు మనోజ్ తెలుగు ఆడియన్స్ లో మాస్ ఇమేజ్ ఉంది. ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ లేటెస్ట్ గా మిరాయ్ సినిమాతో వస్తున్నాడు.

ఆ సినిమాలో బ్లాక్ స్వార్డ్ అంటూ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో మనోజ్ తిరిగి ఫాం లోకి రానున్నాడు. ఇక ఇదే వరుసలో వెంకటేష్ సినిమాలో కూడా మంచు మనోజ్ నటిస్తున్నాడని అంటున్నారు. అదే జరిగితే మాత్రం మంచు హీరోకి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్ ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Siva Karthikeyan : తక్కువ అంచనా వేయకండి అంటున్న తమిళ స్టార్..!