Manchu Manoj : మంచు మనోజ్ గత ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలే మళ్ళీ తిరిగి వచ్చి వరుస ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ టీవీ షోతో మనోజ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. అయితే వెండితెర పై మాత్రం.. ఇప్పటివరకు రీ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా ఆ ఎంట్రీని ఇచ్చేసారు. అయితే ఆ ఎంట్రీ హీరోగా కాకుండా విలన్ గా ఇస్తున్నారు.
అదికూడా సూపర్ పవర్స్ ఉన్న విలన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా విజువల్స్ అయితే వావ్ అనిపించాయి. ఇక తాజాగా మనోజ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా విజువల్స్ తో వావ్ అనిపిస్తుంది.
అలాగే మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదుర్స్ అనిపిస్తుంది. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఆయుధం అయిన బ్లాక్ స్వార్డ్ అనే కత్తిని పట్టుకొని మనోజ్ ఫైట్ చేసే సన్నివేశాలతో గ్లింప్స్ అదుర్స్ అనిపిస్తుంది. మనోజ్ లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఈ గ్లింప్స్ తో మూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ మూవీని ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కళింగ యుద్ధంతో రక్తపాతం సృష్టించిన అశోకుడిని యోగిగా మార్చిన ఒక గొప్ప గ్రంథాన్ని కాపాడే యోధుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తేజ సజ్జ ఆ యోధుడిగా నటిస్తుంటే మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.