Manchu Manoj: నేను ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడలేదు: మంచు మనోజ్

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 01:12 PM IST

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సోషల్ మీడియాకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం సినిమాల విషయంలో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. ముఖ్యంగా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు మనోజ్. ఇది ఇలా ఉంటే ఇటీవల రెండు రోజుల క్రితం మోహన్ బాబు పుట్టిన రోజు, మోహన్ బాబు యూనివర్సిటీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గురించి, ఆ విద్యాసంస్థల గురించి, అందరూ కలిసి ఉండాలని, అందరితో మంచిగా ఉండాలని చెప్తూనే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించి, ఎవరు మంచి చేసారు, ఎవరు చేయలేదు చూసి ఓట్ వేయండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు ఓ పార్టీకి సపోర్ట్ గా, ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో విమర్శించారు. దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. ఇటీవల మా నాన్న పుట్టిన రోజు వేడుకలో నేను మాట్లాడిన మాటలు కొంతమంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.

నేను అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటాను. ప్రోగ్రాం లైవ్ స్ట్రీమింగ్ లో టెక్నికల్ సమస్యల వల్ల నేను మాట్లాడిన కొన్ని మాటలు కూడా కట్ అయ్యాయి. దీంతో నేను మాట్లాడింది తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా మొత్తం స్పీచ్ టెలికాస్ట్ అవ్వలేదు. నేను ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ ఏ ఒక్క పార్టీని కానీ లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయలేదు. నా కుటుంబం తరపున అన్ని పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సాంకేతిక లోపం వల్ల నేను మాట్లాడింది మొత్తం టెలికాస్ట్ అవ్వలేదు టెక్నికల్ టీం చెప్పి సారీ చెప్పారు. నా ఫుల్ స్పీచ్ ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాను. సినిమా ద్వారా ఒక నటుడిగా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే నా లక్ష్యం. నేను వసుదైక కుటుంబం అని మా నాన్న నేర్పించిన కాన్సెప్ట్ ని నమ్ముతాను. నాకు సపోర్ట్ గా ఉన్నవారందరికి ధన్యవాదాలు అని తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.