మంచు ఫ్యామిలీ లో గొడవ (Manchu Family Fight) ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. నాల్గు రోజుల పాటు వీరి గొడవ మీడియా లో హాట్ టాపిక్ గా మారగా..మధ్యలో అల్లు అర్జున్ అరెస్ట్ (Allu Arjun Arrest) తో మంచు ఫ్యామిలీని పట్టించుకునే వారు లేకుండా పోయింది. మొత్తం మీడియా అల్లు అర్జున్ మీదనే ఫోకస్ పెట్టింది. దీంతో చాలామంది మంచు గొడవను మరచిపోయారు. ఇక ఈరోజు మరోసారి మంచు లొల్లి బయటకు వచ్చింది. తాజాగా మంచు మనోజ్(Manchu Manoj).. పహాడ్ శరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుతో పాటు వినయ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. తన అన్న మంచు విష్ణు (Manchu Vishnu) నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా 7 పేజీల ఫిర్యాదు కాపీను పోలీసులకు అందించాడు. దీంతో మరోసారి మంచు గొడవ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్న విషయం తెల్సిందే.
ఈ తగాదాల నడుమ మోహన్ బాబు – మనోజ్ మధ్య గొడవ జరిగి ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో మోహన్ బాబు.. మనోజ్ పైన.. మనోజ్, మోహన్ బాబుపైన కేసు పెట్టడంతో ఈ వివాదం బయటపడింది. ఆ తర్వాత దుబాయ్ నుండి విష్ణు రావడంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే క్రమంలో మీడియా ఫై మోహన్ బాబు చేయి చేసుకోవడం ఇంకాస్త హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆరోగ్యం బాగాలేకపోవడం , ఆ తర్వాత హాస్పటల్ నుండి బయటకు రావడం , తన లెసెన్సు గన్ ను పోలీసులకు అప్పజెప్పడం ఇదంతా జరిగింది. ప్రస్తుతం అంత సర్దుమణిగింది అనుకుంటున్నా టైములో మళ్లీ మనోజ్ వెళ్లి విష్ణు పై ఫిర్యాదు చేయడం అంత మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Travel Tips : సిమ్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతం గురించి మీకు తెలియకపోవచ్చు.!