Site icon HashtagU Telugu

Manchu Manoj Talk Show: మంచు మనోజ్ బాలయ్యకి పోటీ ఇస్తాడా.. ఫస్ట్ గెస్ట్ అతనేనా..!

Manchu Manoj Fight With Bal

Manchu Manoj Fight With Bal

Manchu Manoj Talk Show మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈసారి సినిమాలే కాదు రియాలిటీ షోస్ తో కూడా మెప్పించాలని చూస్తున్నాడు మనోజ్. ఈ క్రమంలో ఈటీవీ విన్ లో ఒక స్పెషల్ చిట్ చాట్ షో కూడా ప్లాన్ చేసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ చేస్తుంది. మంచు మనోజ్ హోస్ట్ గా ఈ షో మొదలవుతుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా వచ్చి మంచు ఫ్యాన్స్ ని అలరించింది.

ఆహా లో ఆల్రెడీ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో చేశారు. ఇప్పుడు ఈటీవీ విన్ వారు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. మంచు మనోజ్ షోలో ఫస్ట్ గెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ వస్తారని తెలుస్తుంది. మంచు మనోజ్ హోస్ట్ గా రవితేజ గెస్ట్ గా షో స్టార్ట్ కానుంది. దసరాకి Manchu Manoj Talk Show ఫస్ట్ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన మనోజ్ ఇక మీదట నో గ్యాప్ అనేస్తున్నాడు.

అంతేకాదు సినిమాల విషయంలో తన దూకుడు కూడా చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే వీటికి సంబందించిన అనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని తెలుస్తుంది. మంచు మనోజ్ తిరిగి ఫాం లోకి రావడం ఆ హీరో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ గా ఉంది.

మంచు మనోజ్ ఈమధ్యనే భూమా మౌనిక రెడ్డిని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లితో మరో కొత్త జీవితం స్టార్ట్ చేసిన మనోజ్ ఈసారి కెరీర్ విషయంలో కూడా వెనక్కి తగ్గేదే లేదన్నట్టు ఉన్నాడు. మంచు ఫ్యాన్స్ కూడా మనోజ్ రీ ఎంట్రీ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

Also Read : Akkineni Akhil : అఖిల్ చాయిస్ పై ఫ్యాన్స్ అసంతృప్తి..!