Manchu Manoj : మౌనికని, తన బాబుని కూడా నా జీవితంలోకి ఆహ్వానించాను.. మనోజ్ ఎమోషనల్ వ్యాఖ్యలు..

కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ టీవీ ఛానల్ లో హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది అనే షోకి ఇటీవలే మనోజ్ తన భార్య భూమా మౌనికను తీసుకొని వచ్చాడు.

Published By: HashtagU Telugu Desk
Manchu Manoj emotional comments on his love with Bhuma Mounika

Manchu Manoj emotional comments on his love with Bhuma Mounika

మంచు మనోజ్(Manchu Manoj) ఇటీవలే మార్చ్ 3న రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దివంగత రాజకీయనాయకుడు భూమా నాగిరెడ్డి(Bhuma Nagireddy) రెండో కూతురు భూమా మౌనిక(Bhuma Mounika)ను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. మనోజ్ రెండో పెళ్లి వార్తల్లో హైలెట్ అయింది. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో సింపుల్ గా కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య మనోజ్ ఇంట్లోనే ఈ వివాహం జరిపించారు.

మనోజ్ – మౌనికల పెళ్లి వీడియో కూడా తాజాగా రిలీజ్ చేశారు. కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ టీవీ ఛానల్ లో హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది అనే షోకి ఇటీవలే మనోజ్ తన భార్య భూమా మౌనికను తీసుకొని వచ్చాడు. ఇటీవల రిలీజయిన ఈ ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవ్వగా నేడు ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ అనేక విషయాలని పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరు ప్రపోజ్ చేశారు పెళ్లి చేసుకుంటామని, ఎలా చేశారు అని వెన్నెల కిషోర్ అడగగా మంచు మనోజ్ సమాధానమిస్తూ.. నేనే చేశాను. నా జీవితంలో ఎదుర్కొన్న బాధలే చాలా పెద్దవి అనుకునేవాడిని. కొన్ని రోజులు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నా. ఆ సమయంలో మౌనిక పడిన కష్టాలు చూసి నావి చాలా చిన్నవి అనిపించింది. నేనే మౌనిక దగ్గరికి వెళ్లి… నువ్వంటే ఇష్టం, ప్రాణం. నా లైఫ్ లో మళ్ళీ సంతోషం, ఆశ, వెలుగు వస్తుందంటే నీ వల్లే. నాకు నీతో కలిసి హ్యాపీగా బతకాలని ఉంది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను, నీ బాబుని కూడా లైఫ్ లోకి ఆహ్వానిస్తాను అని చెప్పాను అని తెలిపాడు.

దీనికి మౌనిక రిప్లై ఇస్తూ.. సరిగ్గానే ఆలోచించావా? ఎవరు ఏమనుకుంటారు? ఈ సొసైటీ ఏమనుకుంటుందో ? ఇంట్లో ఒప్పుకుంటారా? ఇవన్నీ ఆలోచించావా అంటే అవన్నీ నేను చూసుకుంటాను. అవి నా ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఆ తర్వాత మా లవ్ స్టోరీ చెప్పాలంటే చాలా ఉంటుంది అని తెలిపాడు మనోజ్. దీంతో మనోజ్ – మౌనికల లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Also Read  :  Taapsee Pannu : మరోసారి సౌత్ సినిమాలపై తాప్సీసంచలన వ్యాఖ్యలు..

  Last Updated: 19 Apr 2023, 10:28 PM IST