Manchu Manoj: పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు మనోజ్.. ఎందుకో తెలుసా?

తాజాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే వేడుకలను తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు,

Published By: HashtagU Telugu Desk
Manchu Manoj

Manchu Manoj

తాజాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే వేడుకలను తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు, యువ హీరోలు వచ్చి చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక ఈ ఈవెంట్ కి మనోజ్ కూడా రాగా, వేదిక పై మాట్లాడుతూ.. చరణ్ చిన్నప్పటి నుంచి చాలా దయాహృదయుడని చెప్పుకొచ్చారు. 2018లో ఒక ఆడబిడ్డకు సహాయం చేయడం కోసం చరణ్ కి మనోజ్ అర్ధరాత్రి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేసాడని చెప్పుకొచ్చారు.

అలాగే మెగా, మంచు కుటుంబాల బాండింగ్ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు రావవచ్చు. కానీ అవి భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు లాంటివి. వాటి మధ్యకి ఎవరైనా వెళ్ళారా, వాళ్ళే దెబ్బతింటారు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు కూడా అవే. 40 ఏళ్ళ స్నేహం అది. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటివారు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, మోహన్ బాబు స్టైల్ లో మెగా, మంచు రిలేషన్ ఎలాంటిదో కూడా చెప్పారు. ది రిలేషన్ బిట్వీన్ మెగా అండ్ మంచు ఫ్యామిలీ ఈజ్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే వేదిక పై పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్ అంటూ వచ్చే ఎన్నికల ఉద్దేశంతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మంచి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఇంత మంచి అనుబంధం ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

  Last Updated: 28 Mar 2024, 05:10 PM IST