Site icon HashtagU Telugu

Manchu Manoj : రెండో భార్యని తీసుకొని టీవీ షోకి వచ్చిన మంచు మనోజ్.. ఎన్ని సీక్రెట్స్ చెప్పారో తెలుసా?

Manchu Manoj comes to a tv show with his wife Bhuma Mounika

Manchu Manoj

Manchu Manoj :  మంచు మనోజ్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా గత కొద్ది రోజుల నుంచి మాత్రం వార్తల్లో నిలుస్తున్నాడు. మంచు మనోజ్ మొదటి భార్యకు గతంలోనే విడాకులు ఇచ్చి ఇటీవలే మార్చ్ 3న రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దివంగత రాజకీయనాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక(Bhuma Mounika)ను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

మనోజ్ రెండో పెళ్లి వార్తల్లో హైలెట్ అయింది. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో సింపుల్ గా కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య మనోజ్ ఇంట్లోనే ఈ వివాహం జరిపించారు. మనోజ్ – మౌనిక వివాహం తర్వాత మొదటిసారి మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవానికి బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ జంట బయట కనపడలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మనోజ్ తన భార్యని తీసుకొని ఓ టీవీ షోకి వచ్చాడు.

కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఓ టీవీ ఛానల్ లో అలా మొదలైంది అనే ఓ షో చేస్తున్నాడు. ఈ షోలో సెలబ్రిటీ జంటలను తీసుకొచ్చి సరదాగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ లోని విషయాలని చెప్పిస్తాడు కిషోర్. తాజాగా ఈ షోకి మంచు మనోజ్ తన రెండో భార్య భూమా మౌనికను తీసుకొని రాగా ఈ ఎపిసోడ్ ప్రోమో నేడు విడుదలైంది.

ఈ ప్రోమోలో మౌనిక మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయినప్పుడు ఆకాశం వైపు చూస్తూ నాకేం కావాలో నీకు తెలుసు, నీకే వదిలేస్తున్నాను అని అన్నాను. మనోజ్ నా కోసం వస్తాడు అనుకోలేదు. మనోజ్ కోపాన్ని పెళ్లి తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచించేదాన్ని అని ఇలా పలు అంశాల గురించి మాట్లాడింది. ఇక మనోజ్ మాట్లాడుతూ నా కోసం ఒక బిడ్డతో తను ఒంటరిగా నిలబడింది, తన కోసం నేను నిలబడాలి అని అన్నాడు. ప్రోమోలోనే ఇన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయంటే ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాల గురించి మాట్లాడారో అని ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంతా.

 

Also Read :   Vishakha Singh : అనారోగ్యంతో హాస్పిటల్ లో హీరోయిన్.. ప్రతిసారీ ఇంతే అంటూ ఎమోషనల్ పోస్ట్..