Site icon HashtagU Telugu

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: హీరో మంచు మనోజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో మంచు కుటుంబలో అతిధి రాబోతున్నట్టు ప్రకటించాడు. తన భార్య మౌనిక గర్భవతి అని, తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనోజ్ గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం పూర్తిగా మానేశాడు. 2015లో ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన మనోజ్ 2019లో విడాకులు తీసుకుని.. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. మనోజ్‌తో వివాహం జరిగిన సమయంలో మౌనికకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీరి ప్రేమకు చిహ్నంగా మరో బిడ్డ రాబోతున్నాడు. తాజాగా ఇదే విషయాన్ని మనోజ్ వెల్లడించాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన తాతయ్యలు భూమా శోభ, నాగిరెడ్డి మళ్లీ తాతలు కాబోతున్నారని మనోజ్ ట్విట్టర్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.

 

Also Read: Top Today News: టుడే టాప్ న్యూస్