Site icon HashtagU Telugu

Manchu Laxmi: లెస్బియన్ పాత్రలో నటించడంలో థ్రిల్ గా అనిపించింది!

Manchu Laxmi lesbian

Manchu Laxmi

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (Manchu Laxmi) మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్‌స్టర్ (Monstor) మూవీలో లెస్బియన్ (Lesbian) పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాను ఆ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేయాల్సి వచ్చిందో ఓపెన్ అయ్యింది. “నేను లెస్బియన్ (Lesbian) పాత్రలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇలాంటి క్యారెక్టర్ వేయలేదు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అని భయపడినట్టు మంచు లక్ష్మీ (Manchu Laxmi) తెలిపారు. తెలుగుతో పాటు ఇంగ్లీషు చిత్రాలలో నటించిన ఈ నటి మలయాళ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేదని ఒప్పుకుంది.

“సినిమాలో నా మొత్తం పాత్రను వారు ఎలా స్వీకరిస్తారోనని మొదట్లో భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి’’ అని లక్ష్మీ తెలిపారు. “కొందరు అలాంటి పాత్రలకు ఎందుకు దూరంగా ఉంటారో నేను గమనించాను. అయితే స్వలింగ సంపర్కం అనే అంశం అసౌకర్య అంశంగా ఎందుకు మిగిలి ఉందని మీరు అనుకుంటున్నారు? అని మంచు లక్ష్మీ (Manchu Laxmi) ప్రశ్నించారు. నటిగా ఓ నాకు ఇలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను అని అంటోందీమె.

Also Read: Item Girl: ఆ విషయంలో బాలయ్యకు 100 మార్కులు వేస్తాను!