Manchu Lakshmi : మోదీకి థ్యాంక్స్ చెప్పిన మంచులక్ష్మి.. కొత్త పార్లమెంట్ లో సందడి..

మంచు లక్ష్మిని ప్రధాని మోదీ(PM Modi), ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)పార్లమెంట్ సందర్శనకు పిలిచారని, అందుకు ధనువాదాలు అని ట్వీట్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Manchu Lakshmi

Manchu Lakshmi says thanks to PM Modi and Minister Anurag Thakur for Inviting to visit New Parliament

మంచు ఫ్యామిలీ(Manchu Family) ఎప్పుడూ ఎదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. మంచి పనులు చేసినా, ఏదైనా కామెంట్స్ చేసినా, అల్లరి పనులు చేసినా ఫ్యామిలిలో ఎవరో ఒకరు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. సైమా(SIIMA) వేడుకల్లో కెమెరాకు అడ్డు వస్తున్నాడని ఓ వ్యక్తిపై సీరియస్ అయి మంచు లక్ష్మి(Manchu Lakshmi) గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ తో మళ్ళీ వైరల్ అవుతుంది మంచు లక్మి.

మంచు లక్ష్మిని ప్రధాని మోదీ(PM Modi), ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)పార్లమెంట్ సందర్శనకు పిలిచారని, అందుకు ధనువాదాలు అని ట్వీట్ చేసింది. ఢిల్లీ(Delhi)లోని కొత్త పార్లమెంట్(New Parliament) కి వెళ్లి అక్కడ ఫోటోలు, వీడియోలు తీసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు లక్ష్మి ఈ విషయాన్ని తెలిపింది. కొత్త పార్లమెంట్ ని సందర్శించినందుకు చాలా ఆనందంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు, ట్వీట్ వైరల్ గా మారాయి.

గతంలో కూడా పలుమార్లు మంచు ఫ్యామిలీ ప్రధాని మోదీని కలిశారు. ఇప్పుడు మోదీనే పిలిచారని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఇప్పటికే మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. జగన్ మంచు విష్ణుకి బావ అవుతాడు. మరో పక్క మంచు మనోజ్ భార్య టీడీపీలో ఉంది. మనోజ్ కూడా టీడీపీకి సపోర్ట్ ఇస్తూనే జనసేన కూడా ఇష్టం అంటున్నాడు. ఇలా మంచు వారింట అన్ని పార్టీలు ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి మరోసారి ప్రధాని మోదీ పిలిచారని పార్లమెంట్ కి వెళ్లడంతో బీజేపీలో చేరుతుందా అని ఊహాగానాలు కూడా వస్తున్నాయి.

 

Also Read : Manchu Lakshmi: కెమెరాకు అడొచ్చాడని మంచు లక్ష్మి సీరియస్, నెట్టింట్లో వీడియో వైరల్

  Last Updated: 22 Sep 2023, 09:20 AM IST