జూ.ఎన్టీఆర్ (NTR) – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ దేవర (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ నటిస్తుండగా..అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
‘దేవర’లో మంచు లక్ష్మి (Manchu Lakshmi) కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. మంచు లక్ష్మీ ఎన్టీఆర్ కు అక్కగా కనిపించనున్నట్లు చెపుతున్నారు. ఈ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. రీసెంట్ గా తనకు సంబంధించిన షెడ్యూల్లో కూడా ఆమె పాల్గొనట్లుగా సమాచారం. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ మూవీని రెండు పార్ట్స్ గా శివ తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్నో బలమైన పాత్రలున్నాయని, షూటింగ్ జరుగుతున్న తర్వాత రోజురోజుకు పెద్దదైపోయిందని, కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ఔట్ పుట్ తో తమలో ఇంకా ఉత్సాహం కలిగిందన్నారు. నిడివిన దృష్టిలో ఉంచుకొని ఒక్క సన్నివేశంకానీ, ఒక్క సంభాషణ కానీ తొలగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఒక్కటి కూడా తొలగించలేమని తామంతా భావించినట్లు వెల్లడించారు. ఒక్క భాగంలోనే ఇంత పెద్ద కథను ముగించేయాలనుకోవడం కూడా తప్పే అన్న నిర్ణయానికి వచ్చామని, పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క భాగంతో కుదరదని, అందరితో చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also : AP Jobs – 3220 : ఏపీలో భారీ నోటిఫికేషన్.. యూనివర్సిటీల్లో 3220 జాబ్స్ భర్తీ