Manchu Lakshmi Fires On Trolls : నా డ‌బ్బు..నా ఇష్టం..మీకేంటి నొప్పి – మంచు లక్ష్మి ఫైర్

నా జీవితంలో ఎంతో డ‌బ్బును చూశాను. నేను వ‌జ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా, కానీ అమెరికాలో ఉన్న‌ప్పుడు రోజూ తినే తిండికోసం కూడా క‌ష్ట‌ప‌డి ప‌ని చేశా. డ‌బ్బు మ‌న‌కు స్వేచ్ఛ‌ను మాత్ర‌మే ఇస్తుంది

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 03:17 PM IST

మంచు లక్ష్మి (Manchu Lakshmi)..మంచు ఫ్యామిలీ నుండి గ్రాండ్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి..ఆ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. నిర్మాత గా , నటి గా , విలన్ గా , యాంకర్ గా ఇలా తనలోని టాలెంట్ లని బయటకు తీసింది కానీ ఎందులోనూ సక్సెస్ కాలేదు. కాకపోతే సోషల్ మీడియా (Social Media) లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనపై కానీ తన ఫ్యామిలీ ఫై కానీ ఎవరైనా ట్రోల్స్ , విమర్శలు చేస్తే మాత్రం దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తుంటుంది. తాజాగా అలాగే ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇటీవ‌ల ఏయిర్‌పోర్ట్‌లో కార్పేట్ శుభ్రంగా లేద‌ని ఓ వీడియో పోస్ట్ చేయడం ఫై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇది రోజు రోజుకు ఎక్కువై పోతుండడం తో లక్ష్మి రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో ను సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసింది.

`అంద‌రికీ న‌మ‌స్కారం. ఇటీవ‌ల ఏయిర్‌పోర్ట్‌లో కార్పేట్ శుభ్రంగా లేద‌ని ఓ వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో తీసిన ఫొటో వ‌ల్ల అది ఇంకా క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంద‌ని అన్నాను. దీనికి చాలామంది `ఓహో నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళుతున్నావా? నీకు ఐఫోన్ ఉందా?`అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. అసలు`నువ్వు కొనిచ్చావా?..నా క‌ష్టం..నా సంపాద‌న‌..నా ఇష్టం. నీకెమిరా నొప్పి? . నువ్వేమైనా డ‌బ్బులు ఇస్తున్నావా?..నేను బిజినెస్ క్లాస్‌లో ప్ర‌యాణించ‌డం, ఐఫోన్ వాడ‌టం త‌ప్పు అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు అంటూ ఓ రేంజ్ లో లక్ష్మి క్లాస్ పీకింది. ఒక స‌గ‌టు మ‌హిళ ఏమీ చెప్పుకోడదా..? సోష‌ల్ మీడియాలో ఏదీ పోస్ట్ చేయకూడదా..? మీ స‌మ‌స్య ఏంటీ? డ‌బ్బులు సంపాదించ‌డానికి నేను చాలా క‌ష్ట‌ప‌డ‌తా. మా అమ్మానాన్న‌లెవ‌రూ నాకు డ‌బ్బులు ఇవ్వ‌రు. క‌ష్ట‌ప‌డ‌టం నేర్పించారు. డ‌బ్బు ఉంటే సంతోషం ఉంటుంద‌ని చాలా మంది అనుకుంటారు. వాళ్ల‌తో నేను ఏకీభ‌వించను.

Read Also : AP : రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.20 వేలు ఇస్తాడు – రఘురామ

నా జీవితంలో ఎంతో డ‌బ్బును చూశాను. నేను వ‌జ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా, కానీ అమెరికాలో ఉన్న‌ప్పుడు రోజూ తినే తిండికోసం కూడా క‌ష్ట‌ప‌డి ప‌ని చేశా. డ‌బ్బు మ‌న‌కు స్వేచ్ఛ‌ను మాత్ర‌మే ఇస్తుంది. వంట చేయ‌డంలో త‌ప్పులేదు. పిల్ల‌ల్ని పెంచ‌డంలో త‌ప్పులేదు. కానీ నువ్వు అదే చేయాలి. మ‌రొక‌టి చేయ‌కూడ‌దు అన‌డం నా దృష్టిలో త‌ప్పు. మ‌నం ప్ర‌తి దానికి త‌ప్పుప‌ట్ట‌కూడ‌దు. జీవితం చాలా చిన్న‌ది. వేరే వాళ్ల కోసం బ‌తికే బ‌తుకు ఒక బ‌తుకేనా?. ఇత‌రుల అభిప్రాయాలు ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశ‌నం చేసుకోకు` అంటూ ట్రోల్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.