కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోలుగా ఇద్దరు స్టార్ రేంజ్ అందుకోవడంలో విఫలమయ్యారు. ఐతే వారు మాత్రం ప్రయత్నాలు చేయడం మానట్లేదు. మంచు విష్ణు (Manchu Vishnu) అడపాదడపా సినిమాలు చేస్తుండగా మంచు మనోజ్ మాత్రం సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. తన పర్సనల్ లైఫ్ డిస్టబన్స్ వల్ల మంచు మనోజ్ (Manchu Manoj) కెరీర్ ని కూడా సరిగా పట్టించుకోలేదు. ఫైనల్ గా మొదటి భార్య ప్రణితకు విడాకులు ఇచ్చి మంచు మనోజ్ భూమా మౌనికని పెళ్లాడాడు.
లాస్ట్ ఇయర్ వీరి మంచు మనోజ్ మౌనికల మ్యారేజ్ జరగ్గా ఆ వేడుకలకు మంచు విష్ణు దూరంగా ఉన్నాడు. మంచు లక్ష్మి (Manchu Lakshmi) దగ్గర ఉండి మనోజ్, మౌనీల మ్యారేజ్ చేసింది. ఇక ఇప్పుడు మనోజ్ మౌనికలకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు దేవసేన శోభ (Devasena Shobha) అని పెట్టారు. ఐతే ఈమధ్యనే జరిగిన మంచు మనోజ్ మౌనికల పాప బారసాల వేడుకలకు కూడా మంచు విష్ణు దూరంగా ఉన్నాడు.
మంచు విష్ణు మనోజ్ ల మధ్య ఏదో సైలెంట్ ఫైట్ జరుగుతుందని టాక్. ఆమధ్య మంచు విష్ణుకి సంబందించిన మనుషులు మనోజ్ మనుషుల మీద దాడికి దిగినట్టుగా మనోజ్ చెప్పుకొచ్చాడు. ఐతే ఆ తర్వాత అందతా ఒక రియాలిటీ షోలో భాగమని ఆడియన్స్ ని ట్రాక్ తప్పించారు. మంచు మనోజ్ మౌనికల పెళ్లి మ్యాటర్ మంచు విష్ణుకి నచ్చలేదని అందుకే తమ్ముడిని దూరం పెట్టాడని అంటున్నారు.
ఐతే కొడుకులు ఇద్దరిని ఇలా చెరోదారి అన్నట్టుగా ఉండటం చూసి మంచు మోహన్ బాబు బాగా ఫీల్ అవుతున్నాడని తెలుస్తుంది. మంచు విష్ణు త్వరలో కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమాలో గొప్ప నటీనటులను తీసుకున్న మంచు విష్ణు తమ్ముడిని మాత్రం స్కిప్ చేశాడు. మరోపక్క మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ఈమధ్యనే మొదలు పెట్టాడు. మిరాయ్ (Mirai) లో విలన్ తో పాటుగా తను లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తున్నాడు మంచు మనోజ్.
