Site icon HashtagU Telugu

Tollywood : ‘మనం’ మళ్లీ చూడబోతున్నాం..

Manam Re Release

Manam Re Release

టాలీవుడ్ లో ప్రస్తుత రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో సూపర్ హిట్ అయినా చిత్రాలే కాక అగ్ర హీరోల తాలూకా మూవీస్ కూడా సరికొత్త టెక్నాలజి తో రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో అక్కినేని ఫామిలీ ఎవరు గ్రీన్ మూవీ ‘మనం’ మరోసారి మనముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

We’re now on WhatsApp. Click to Join.

విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ ఇలా టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం మూవీ..2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది. ఈ మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాని మే 23 న మరోసారి థియేటర్స్ కు తీసుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్స్ లో ఈ సినిమా స్పెషల్ షో లు వేయనున్నారు. హైదరాబాద్ లో దేవి 70mm థియేటర్ ,వైజాగ్ లోని శరత్ థియేటర్ ,విజయవాడలోని స్వర్ణ మల్టీప్లెక్స్ లో ఇప్పటికే బుకింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు ఈ మూవీ బుల్లితెర ఫై కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలీ వారే కాదు అక్కినేని అభిమానులు కూడా ఎప్పటికి మరచిపోరు. అలాంటి గొప్ప చిత్రం మరోసారి మన ముందుకు వస్తుందని తెలిసి అంత మరోసారి చూడాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోల సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ ..ఇలా ఈ ముగ్గురి సినెమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం సందడి చేయలేకపోతున్నాయి. వరుస ప్లాప్స్ తో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ తో రాబోతున్నాడు.

Read Also : MLC Kavitha : 63 రోజులు అవుతున్నా కవిత బెయిల్‌పై నో క్లారిటీ..!

Exit mobile version