Mana Shanakara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరాప్రసాద్ గారు’ జనవరి 12, 2026న భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో నిలుస్తున్న ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
ఈ కొత్త పోస్టర్‌లో చిరంజీవి బ్లాక్ సూట్‌లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మెగాస్టార్‌ను ఇంత క్లాస్, ఎలిగెంట్ లుక్‌లో చూడటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?
20 DAYS to go for Megastar @KChiruTweets garu's #ManaShankaraVaraPrasadGaru ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATRES ON 12th JANUARY 2026 💥💥💥#MSGonJan12th #Chiranjeevi pic.twitter.com/cFsqIX7Zas
— Team Megastar (@MegaStaroffl) December 23, 2025
చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు
ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రం మెగా అభిమానులకు, ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
