Mammootty: మమ్ముట్టి సినిమాను విడుదల చేయబోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది. లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా […]

Published By: HashtagU Telugu Desk
Bramhayugam

Bramhayugam

Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది.

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా యొక్క వైవిధ్యమైన కథాంశానికి, ఇందులోని మమ్ముట్టి అద్భుతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.

  Last Updated: 19 Feb 2024, 11:11 PM IST