Malli Pelli Trailer: నరేశ్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్.. బోల్డ్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్

నరేశ్, పవిత్రా లోకేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన మళ్లీ పెళ్లి ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Malli Pelli

Malli Pelli

ఇటీవల సిల్వర్ స్క్రీన్స్ పై ఎన్నో బయోపిక్ (Biopics) లను చూశాం. కానీ మొదటి సారి ఓ నటుడు, నటికి సంబంధించిన వివాదాల ఆధారంగా సినిమా రాబోతోంది.  ఆ మూవీనే మళ్లీ పెళ్లి. సీనియర్ నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్‌ సంస్థ నరేశ్ సొంతంగా నిర్మిస్తున్నారు. తన వైవాహిక జీవితాన్నే నరేశ్ తెరపై చూపెట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

కొన్నాళ్లుగా కలిసి ఉంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నరేశ్ (Naresh), పవిత్ర జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నరేంద్రగా నరేశ్, పార్వతిగా పవిత్రగా కనిపించారు. నరేశ్  నిజ జీవితంలో మూడో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. ‘పార్వతీ మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా’ అని నరేశ్.. పవిత్రను అడిగే డైలాగ్స్ ఆసక్తిని రేపుతుంది. ఇక వర్షం, నీవు చెప్పి రారు కదా అనే డైలాగ్స్ కూడా ఆకర్షిస్తోంది.

ఈ మూవీలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను బోల్డ్ గా చూపెట్టే ప్రయత్నం చేశారు. ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే..యాక్టర్ నరేశ్ ను ఉద్దేశించి పెట్టినదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బీజీఎం కూడా బోల్డ్ కంటెంట్ అని చెప్పకనే చెప్పేస్తుంది. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. ఒక విధంగా ఇది బోల్డ్ అంటెప్ట్ అనుకోవాలి. నరేష్ పెళ్లిళ్ల సంగతులు, భార్యతో గొడవలు, పవిత్రా లోకేష్ (Pavitha Lokesh) తో లివింగ్ టుగెదర్ ఇవన్నీ జనాలకు పబ్లిక్ గా తెలిసిన సంగతులే. ఇప్పుడు ఇవే సంగతులు తెర మీదకు తెచ్చారని ట్రయిలర్ చెప్పేసింది.

Also Read: Ration Dealers: రేషన్ డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోవాలి: మంత్రి గంగుల

  Last Updated: 11 May 2023, 01:36 PM IST