తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి (Malla Reddy) స్టైల్ వేరే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడిన నిమిషాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇన్నాళ్లు ఆయన లో రాజకీయ నాయకుడ్ని మాత్రమే చూశాం. కానీ ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ఆయనలో విలనిజం చూశారు. సదరు మంత్రిగారిని వెంటనే సంప్రతించి ఆఫర్ కూడా చేశాడు. అదీ కూడా పవన్ కళ్యాణ్ మూవీ. ఇంతకీ మల్లారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో తెలుసా?
తెలంగాణ మంత్రి, విద్యాసంస్థల అధినేత అయినా మల్లా రెడ్డి (Malla Reddy) హరీష్ శంకర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మల్లా రెడ్డి ప్రకారం.. “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం హరీష్ శంకర్ తనను సంప్రదించాడు. ఇరువురి మధ్య దాదాపు గంటన్నరపాటు సంభాషణ సాగింది, అయితే మల్లా రెడ్డి ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ప్రధాన విలన్ పాత్రకు మల్లారెడ్డి సరిగ్గా సరిపోతాడని హరీష్ శంకర్ భావించారు. అయితే మల్లారెడ్డి హైప్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారా? హరీశ్ శంకర్ నిజంగా మల్లారెడ్డిని కాంటాక్ట్ అయ్యాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5న ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం కీలక షెడ్యూల్ ను షూట్ చేసేందుకు చకాచకా పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం 90 రోజులు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అటు టాలీవుడ్, ఇటు రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: 38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్