Site icon HashtagU Telugu

Rajinikanth : మలేషియా ప్రధానమంత్రిని కలిసిన రజినీకాంత్.. విదేశాల్లో రజిని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది..

Malaysia Prime Minister Anwar Ibrahim Meets Rajinikanth Photos goes Viral

Malaysia Prime Minister Anwar Ibrahim Meets Rajinikanth Photos goes Viral

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కి మన ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న సంగతి తెలిసిందే. జపాన్, మలేషియా, సింగపూర్.. లాంటి దేశాల్లో కూడా రజినీకాంత్ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు అక్కడ కూడా కలెక్షన్స్ రాబడతాయి. తాజాగా రజినీకాంత్ మలేషియా ప్రధానమంత్రి(Malaysia Prime Minister) అన్వర్ ఇబ్రహీంని(Anwar Ibrahim) కలిశారు.

మలేషియా వెళ్లిన రజినీకాంత్ ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదరంగా ఆహ్వానించి రజినీతో కాసేపు ముచ్చటించారు. రజినీతో కలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రపంచవ్యప్తంగా ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న రజినీకాంత్ ని కలవడం ఆనందంగా ఉంది. ప్రజలకు నేను చేసే సేవలను ఆయన అభినందించారు. ఆయన భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో సామాజిక అంశాలు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ట్విట్టర్ లో తెలిపారు.

దీంతో మలేషియా ప్రధాని రజినీకాంత్ ని కలవడం వైరల్ గా మారింది. ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే రజిని గతంలో కూడా 2017లో కబాలి సినిమా సమయంలో అప్పటి మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ని కూడా కలిశారు. రజినీకి మలేసియాలో ఉన్న స్టార్ డమ్ తోనే ప్రధానులు ఆయన్ని కలుస్తున్నారని భావిస్తున్నారు.

 

Also Read : Jawan Collections : నాలుగు రోజుల్లో ఏకంగా 520 కోట్లు.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సునామీ..