Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!

Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 18, 2024 / 12:38 PM IST

Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో సుకుమార్ నో క్రాంప్రమైజ్ అనేలా ప్రిపేర్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సుకుమార్ అనుకున్న దానికి మించి సినిమా చేస్తున్నాడు. పుష్ప 2 ని ఆగష్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడుతుంది.

ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా మలేషియా సెట్ వేసినట్టు తెలుస్తుంది. అసలైతే సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్లాల్సి ఉన్నా రిలెజ్ టైం దగ్గర పడుతున్న ఈ టైం లో అక్కడ షెడ్యూల్ కష్టమని భావించి మలేషియానే హైదరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీకి రప్పించేశారట. అంటే మలేషియా సెట్ వేసి ఫిల్మ్ సిటీలోనే కానిచ్చేస్తున్నారట.

మరోపక్క సినిమా లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ డేట్స్ కి సంబందించి కూడా కాస్త హడావిడి జరుగుతుందట. మలయాళంలో బాగా బిజీగా ఉన్న ఫాహద్ పుష్ప 2 లో ఎస్పీ షెకావథ్ గా నటిస్తున్నారు. పుష్ప 1 చివర్లో ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ సీన్స్ ఆడియన్స్ ని మెప్పించాయి.

పుష్ప 2 తో మరోసారి ఈ ఇద్దరు నువ్వా నేనా అనుకునేలా చేస్తారని తెలుస్తుంది. పుష్ప 2 లో యాక్షన్ సీన్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. మరి సినిమ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read : Kalki 2898 AD : ‘కల్కి’ మూవీలో ప్రభాస్ బుజ్జికి వాయిస్ ఇచ్చేది.. ‘కీర్తి సురేష్’నా..!